భారతదేశంలోకి తిరిగి ప్రవేశించనున్న Mitsubishi, కానీ మీరు అనుకున్న విధంగా కాదు

ఫిబ్రవరి 22, 2024 04:13 pm rohit ద్వారా సవరించబడింది

  • 39 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జపనీస్ బ్రాండ్ భారతదేశంలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ డీలర్లలో ఒకటైన TVS VMSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Mitsubishi returning to India

2020 ప్రారంభంలో అమలు చేసిన BS6 ఉద్గార నిబంధనల తరువాత, భారతీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్ నుండి నిష్క్రమించిన మిత్సుబిషి, ఇప్పుడు కంపెనీ 2024 లో మరోసారి భారత మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో అతిపెద్ద మల్టీ బ్రాండ్ డీలర్లలో ఒకటైన TVS వెహికల్ మొబిలిటీ సొల్యూషన్ (TVS VMS)లో 30 శాతానికి పైగా షేర్లకు సభ్యత్వాన్ని పొందింది. TVS వెహికల్ మొబిలిటీ సొల్యూషన్స్ రెనాల్ట్, మహీంద్రా మరియు హోండా వంటి పలు కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తి చేసే వాహనాల  పంపిణీని కూడా నిర్వహిస్తుంది.

డీల్ వివరాలు

Mitsubishi Corporation

పలు ఆన్లైన్ నివేదికల ప్రకారం, మిత్సుబిషి 10 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు నివేదికలు వచ్చాయి. సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ నుండి ఆమోదం పొందిన తరువాత, ఈ లావాదేవీలు పూర్తవుతాయి, దీని కోసం మిత్సుబిషి తన ఉద్యోగులను డీలర్ల వద్దకు పంపుతుంది. ఈ పెట్టుబడి ద్వారా, మిత్సుబిషి భారతదేశంలోని జపనీస్ వాహన తయారీదారులకు అధునాతన మొబిలిటీ పరిష్కారాన్ని అందిస్తుంది, ఇది ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మరియు మల్టీ బ్రాండ్ అమ్మకాలు చేయడమే కాకుండా, లీజింగ్ మరియు ఇతర ఆటోమోటివ్ వెంచర్ల రంగంలో కూడా పనిచేస్తుంది. ఇది TVS VMS మరియు డిజిటల్ టెక్నాలజీ యొక్క విస్తృత కస్టమర్ బేస్‌ని ఉపయోగించుకోవడం ద్వారా జరుగుతుంది.

భారతదేశంలో మిత్సుబిషి కార్లు తిరిగి రానున్నాయా?

Mitsubishi Pajero Sport

మిత్సుబిషి భారత ఆటోమోటివ్ స్పేస్లో ఆక్టివ్ స్టేటస్ లోకి రాబోతున్నప్పటికీ, మిత్సుబిషి కార్లు భారతదేశానికి తిరిగి వస్తాయా లేదో అనేది ఇంకా ధృవీకరించబడలేదు. మిత్సుబిషి భారతదేశంలో మల్టీ బ్రాండ్ డీలర్‌షిప్‌లతో కార్ల లైనప్‌ను తిరిగి తీసుకువస్తే, వారి దృష్టి ఎలక్ట్రిక్ కార్లపై కూడా ఉంటుంది. కాబట్టి, ప్రస్తుతానికి పజేరో స్పోర్ట్ మళ్లీ వస్తుందని ఆశించలేము.

జపనీస్ కార్ల తయారీదారుల యొక్క ఉప-బ్రాండ్లు భారతదేశంలో షాప్లను ఏర్పాటు చేసే అవకాశాన్ని సృష్టించడానికి ఈ కొత్త భాగస్వామ్యం ప్రయత్నిస్తుంది, జపనీస్ కార్ బ్రాండ్లు మరియు మోడళ్ల సంఖ్యను పెంచడానికి చర్చలను మిత్సుబిషి నిర్వహిస్తుంది. అంటే భారతదేశంలో మాజ్డా మరియు ఇన్ఫినిటీ (నిస్సాన్ ప్రీమియం సబ్ బ్రాండ్) వంటి కార్లను మనం చూడవచ్చు.

మిత్సుబిషి యొక్క ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో ఏ జపనీస్ కారును విడుదల అవ్వాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ లో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ SUV ట్రేడ్మార్క్ భారతదేశంలో ట్రేడ్మార్క్ చేయబడింది. త్వరలో విడుదలకానుందా? 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

2 వ్యాఖ్యలు
1
S
s hussain
May 2, 2024, 1:36:53 PM

Mitsubishi motors is a very good brand & it should come back to India, previously they have come with wrong partner HINDUSTAN MOTORS they are hopeless, sold the ambassador model without any charges

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    R
    rohit r jagiasi
    Mar 9, 2024, 3:01:42 PM

    Would love to see Mitsubishi Pajero, Outlander & Lancer

    Read More...
      సమాధానం
      Write a Reply
      Read Full News

      ట్రెండింగ్‌లో ఉందికార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      ×
      We need your సిటీ to customize your experience